News March 24, 2025
ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు

AP: విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ వర్సిటీ ముందుకొచ్చిందన్నారు. ₹1,300Cr పెట్టుబడి పెట్టనుందని, 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం, GNU మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
Similar News
News April 1, 2025
ఆరుబయట పడుకుంటున్నారా?

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
News April 1, 2025
స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
News April 1, 2025
ALERT: ఎండలు, పిడుగులతో వానలు

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <