News March 24, 2025

వికారాబాద్: 26న 148 వాహనాల వేలం

image

వికారాబాద్ జిల్లాలో ఈనెల 26న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గుర్తుతెలియని 148 వాహనాలకు వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SHARE IT.

Similar News

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

KNR: ‘పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి’

image

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.

News September 15, 2025

వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

image

జపాన్‌లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.