News March 24, 2025
నాగార్జునసాగర్ నేటి సమాచారం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News July 8, 2025
ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదని, అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
News July 8, 2025
NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
News July 8, 2025
NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.