News March 24, 2025

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో అవినీతి: కాకాణి

image

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 8 అనుకూల సంస్థలకే రూ.28,210 కోట్ల విలువైన పనులు అప్పగించారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి 8 శాతం కమీషన్లు పుచ్చుకున్నారన్నారు.

Similar News

News April 21, 2025

నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

News April 21, 2025

నెల్లూరు: చెట్టును ఢీకొని ఇద్దరి మృతి

image

మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకో వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News April 20, 2025

నెల్లూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిల్వర్ బాక్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలను అప్సానాతో వెంకటాద్రి నాయుడు, చెస్ రాష్ట్ర కార్యదర్శి సుమన్‌ ఆదివారం ప్రారంభించారు. 280 మంది క్రీడాకారులు 2 ఉభయ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతకు నగదగతో పాటు, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేస్తారని గోపీనాథ్, డాక్టర్ మధు తెలిపారు.

error: Content is protected !!