News March 24, 2025

ములుగు: బెట్టింగ్‌కు పాల్పడే వారి సమాచారం ఇవ్వండి: ఎస్పీ

image

ములుగు జిల్లాలో ఐపీఎల్ క్రీడల సందర్భంగా బెట్టింగులకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్లలో లక్షల్లో డబ్బు పెట్టి మోసపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు.

Similar News

News November 11, 2025

స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

image

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్‌రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై SC తాజా తీర్పు ఇచ్చింది.

News November 11, 2025

ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <>RITES<<>>) 7 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC,ST, PWBDలకు రూ.300. వెబ్‌సైట్: http://www.rites.com

News November 11, 2025

మెట్‌పల్లి: తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

image

మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో ఎల్లగంగ నరసయ్య(74)ను హత్య చేసిన ఆయన కుమారుడు ఎల్ల అన్వేష్(32)ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. తండ్రి పెళ్లి చేయలేదని, ఏదైన పనిచేయమని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, మొబైల్ ఫోన్, ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.