News March 24, 2025
రాత్రి బెడ్ రూమ్‌లో ఇలా చేస్తున్నారా?

నిద్ర పోయే సమయంలో బెడ్ రూమ్‌లోకి దోమలు రాకుండా నివారణ యంత్రాలను వాడుతుంటారు. వీటి వాసనను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే హానికరమైన రసాయనాలతో శ్వాస సంబంధిత వ్యాధులకు ఆస్కారం ఉందంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. వీటికి బదులుగా సహజ ప్రత్యామ్నాయాలు వాడటం, దోమతెరలను ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.
Similar News
News March 30, 2025
నెలవంక దర్శనం.. రేపే రంజాన్

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.
News March 30, 2025
విషాదం.. ఆరుగురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.