News March 24, 2025

VJA: అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్‌ఎస్‌) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రజల నుంచి కలెక్టర్ 133 అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌‌లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

image

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.

News November 7, 2025

రేపు కుప్పంలో రూ.2 వేల కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

image

కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 7 పరిశ్రమల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంతం పారిశ్రామిక వికాసం దిశగా ప్రగతి పథంలో ముందడుగు వేయడంలో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు రానున్నాయి. దీని ద్వారా దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి.

News November 7, 2025

నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

image

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.