News March 25, 2025

తిరుపతి: పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షలు నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2,080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News January 18, 2026

రుక్మిణీ వసంత్ డేటింగ్?.. క్లారిటీ!

image

‘కాంతార-2’ భామ రుక్మిణీ వసంత్ ఫొటో SMలో వైరలవుతోంది. ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి సిద్ధాంత్ నాగ్ కాగా, అతనొక ఫొటోగ్రాఫర్ అని సమాచారం. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇది 2023లో దిగిన ఫొటో కాగా తాజాగా వైరలవ్వడం గమనార్హం. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్-నీల్, టాక్సిక్ మూవీల్లో నటిస్తున్నారు.

News January 18, 2026

చీపురుపల్లి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

image

చీపురుపల్లిలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన యువకుడు తన స్కూటీపై చీపురుపల్లి వైపు వెళ్తుండగా..మూడు రోడ్ల జంక్షన్ వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువ కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

News January 18, 2026

తాండూరులో దారుణం.. తమ్ముడిని చంపిన అన్న..!

image

తాండూరు మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్, రెహమాన్ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య చాలారోజులుగా ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య స్థలం విషయంపై మళ్లీ చర్చ జరుగుతుండగా ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన మోసిన్ రెహమాన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.