News March 25, 2025

KTDM: ‘అగ్నివీర్ ఎంపిక కోసం దరఖాస్తులు చేసుకోండి’

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అవివాహిత పురుష అభ్యర్థులు 2026వ సంవత్సరానికి గానూ అగ్నివీర్ ఎంపిక కోసం దరఖాస్తులను ఆన్‌లైన్లో చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ సోమవారం తెలిపారు. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం WWW.JOININDIANARMY.NIC.IN అనే వెబ్సైట్‌ను చూడవచ్చన్నారు.

Similar News

News October 17, 2025

ఆర్ట్స్ అండ్ సైన్స్‌ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

image

సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాళ్లు ఎస్.జ్యోతి, నర్సింహాచారి తెలిపారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు.

News October 17, 2025

GNT: అంగన్‌వాడీ అద్దె బకాయిలు రెండు రోజుల్లో జమ

image

గుంటూరు జిల్లాలోని ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలను రెండు రోజుల్లోకార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పి.వి.జి. ప్రసున తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే బకాయిల విడుదలకు బడ్జెట్‌ను విడుదల చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై సిబ్బందికి తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు.

News October 17, 2025

అన్నమయ్య: టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

అన్నమయ్య జిల్లాలోని ఓ టీచర్‌పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన ఓ టీచర్ తంబళ్లపల్లెలో పనిచేస్తున్నారు. ఆయన దగ్గర 50 మందికి పైగానే రూ.2కోట్ల వరకు చీటీలు వేశారు. తమ డబ్బు ఒకేసారి ఇవ్వాలని కోరగా టీచర్ నిరాకరించారని బాధితులు వాపోయారు. ఈ మేరకు మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు ఆస్తులు ఉన్నాయని.. 4 నెలల సమయమిస్తే చెల్లిస్తానని టీచర్ చెప్పినట్లు సమాచారం.