News March 25, 2025

LRS చెల్లింపులపై విస్తృత ప్రచారం చేయాలి: ASF కలెక్టర్

image

లే ఔట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా LRS రుసుము చెల్లింపులపై ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులకు సూచించారు. వాంకిడి గ్రామపంచాయతీలో LRS -2020లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31లోగా రుసుము చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News January 24, 2026

మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.

News January 24, 2026

ఏలూరు: 2018లో మొదలైన హత్యాకాండ..!

image

ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి, విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా బేగ్ మిత్రులు. వీరు జల్సాలు చేయడానికి ఈజీ మనీ సంపాదనపై పడ్డారు. చిన్న చిన్న దందాలతో వచ్చే చిల్లర చాలక మనుషుల ప్రాణాలు తీయడానికి నిర్ణయించుకున్నారు. మొదటిసారి 2018లో ముసునూరు (M) గోపవరానికి చెందిన ఉమామహేశ్వరరావును చంపడానికి స్కెచ్ వేశారు. బేగ్ తయారు చేసిన సైనైడ్‌ను సింహాద్రి ప్రసాదంలో కలిపి ఉమామహేశ్వరరావుకు ఇచ్చాడు. (1/2)

News January 24, 2026

MANAGEలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (<>MANAGE<<>>) 3 Assist. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రి B.M./HR మేనేజ్‌మెంట్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.manage.gov.in