News March 25, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. మొత్తం 50 అర్జీలు స్వీకరించామన్నారు
Similar News
News March 30, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News March 30, 2025
టెక్కలి: దూరవిద్యలో డిగ్రీ పూర్తికి ముగుస్తున్న గడువు

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలో B.A, B.Com డిగ్రీ విద్యనభ్యసించేందుకు దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 31తో ముగుస్తుందని శనివారం కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తిర్ణీత అయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
News March 30, 2025
శ్రీకాకుళం: ట్రైన్ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని- అన్నవరం స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి ఓ వృద్ధురాలు మృతి చెందిందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం తెలపగా.. మృతురాలు పలాసకు సమీపంలోని సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ సరస్వతమ్మ (70)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.