News March 25, 2024

మగువ.. ఆత్మరక్షణ విద్యతో తెగువ

image

ప్రస్తుత సమాజంలో బాలికలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య అవశ్యం. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. తమను తాము రక్షించుకోవడం సహ ఒకానొక సందర్భంలో ఇతరులకు అండగా మారొచ్చు. దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వేధింపులకు గురైతే నేరుగా ఎదుర్కోగలుగుతారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరాటే శిక్షణ నేర్పుతున్నారు.

Similar News

News September 8, 2025

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

News September 8, 2025

చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

image

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News September 8, 2025

మెదక్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.