News March 25, 2025
అర్జీలపై అలసత్వం చేయొద్దు: అన్నమయ్య ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ-ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News December 31, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
న్యూ ఇయర్.. ప్రత్యేక తనిఖీలు: VKB SP

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో SHOలు ప్రత్యేక బృందాలతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్, విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తారని SP స్నేహ మెహ్రా తెలిపారు. వేడుకల ముసుగులో ఎక్కడైనా ఈవ్ టీజింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
News December 31, 2025
నాగర్‌కర్నూల్‌లో తగ్గిన చలి తీవ్రత

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత బుధవారం కాస్త తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. అమ్రాబాద్, కల్వకుర్తిలో అత్యల్పంగా 12.4 డిగ్రీలు నమోదు కాగా, బిజినపల్లిలో 12.6, నాగర్‌కర్నూల్‌లో 13.5, తాడూరులో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు.


