News March 25, 2025
నిర్మల్: అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగించినట్లు నిర్మల్ జిల్లా డీపీఆర్ఓ విష్ణు తెలిపారు. మార్చి 31తో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు కాల పరిమితి ముగియనుండగా తిరిగి జూన్ 30 వరకు కార్డుల కాల పరిమితిని పెరిగినట్లు పేర్కొన్నారు.. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్‌లు

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చింది. బైజూస్‌తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్‌లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్‌లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.
News September 16, 2025
రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.
News September 16, 2025
ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు.. శనీశ్వరుడుది: AP FactCheck

AP: తిరుపతి అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారం అసత్యమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ విగ్రహం అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరునిదని స్పష్టం చేసింది. ‘విగ్రహం తయారీలో లోపం కారణంగా శిల్పి పట్టు కన్నయ్య దీనిని ఇక్కడే వదిలేశారు. పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. ఇలాంటి పోస్టులను ఎవరూ సోషల్ మీడియాలో షేర్, పోస్ట్ చేయవద్దు’ అని పేర్కొంది.