News March 25, 2025
WNP: ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం: అదనపు కలెక్టర్

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆదేశించారు. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రేషన్ డీలర్లు, పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News March 31, 2025
KMM: రంజాన్ వేడుకల్లో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులకు భట్టి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
News March 31, 2025
ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన గ్రోక్!

‘ఎక్స్’ అధినేత మస్క్‌కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.