News March 25, 2025
NZB: అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించిన పల్లె గంగారెడ్డి

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి సోమవారం అస్సాం రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అస్సాం, త్రిపుర రాష్ట్రాల సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్ర రాజుని కలిశారు. అనంతరం ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అక్కడి రాష్ట్రాల్లో పసుపు పంట సాగు గురించి అలాగే పసుపు ఉత్పత్తుల గురించి చర్చించి పలు విషయాలను తెలుసుకున్నారు.
Similar News
News March 31, 2025
నిజామాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. నిజామాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
News March 31, 2025
NZB: 1981లో మంచినూనె ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పైపైకి పోతుంటే..ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు రాజిగో రాజన్న అన్న పాట గుర్తోస్తోంది. సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనే పరిస్థితులు బాగున్నాయని అంటున్నారు జనాలు.1981లో kg మంచినూనె ₹13:80, 1/2kg శనగపిండి ₹2:50, జిందాతిలిస్మాత్ ₹1:10, బట్టల సబ్బు ₹1:60, కొబ్బరికాయ ₹1:75గా ఉన్న ఓ బిల్లు వైరల్ అవుతోంది.
News March 31, 2025
NZB: సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడాలి: MLA

సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం ఆయన నగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, పలు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్వా గార్డెన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక అని పేర్కొన్నారు.