News March 25, 2025

KMR: జర్నలిస్ట్‌ల అక్రడిటేషన్ కార్డుల గడువు పెంపు

image

రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని 3 నెలల పాటు పొడిగించినట్లు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ&పీఆర్ విభాగం వర్కింగ్ జర్నలిస్టులను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసౌకర్యాన్ని చెల్లుబాటును మూడు నెలల పాటు పొడిగించారన్నారు.

Similar News

News March 31, 2025

లేపాక్షి: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్‌ఏ ఇంటి పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News March 31, 2025

మందమర్రి: హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

మందమర్రిలోని పాత బస్టాండ్ వద్ద వన్ మేడి హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2025

బుమ్రా బౌలింగ్‌లో ఆడటం కష్టం: పాక్ కెప్టెన్

image

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్‌‌ బౌలింగ్‌ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.

error: Content is protected !!