News March 25, 2025

NZB: కాంగ్రెస్ రెండు గ్రూపుల వర్గపోరుపై అధిష్టానం నజర్

image

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల వర్గపోరుపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ప్రతినిధికి, ఇటీవల పార్టీలో చేరిన ప్రతినిధికి మధ్య జరుగుతున్న వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో పలువురు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BRS హయాంలో కష్ట కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని వాపోతున్నారు.

Similar News

News July 10, 2025

ఏపీ సీఎం చంద్రబాబుకు MLC కవిత లేఖ

image

APలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని MLC కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.

News July 10, 2025

NZB జిల్లాలో 51.11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.

News July 10, 2025

NZB: కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ: MLCకవిత

image

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.