News March 25, 2025
WNP: మిల్లులపై కేసులు బుక్ చేయండి: కలెక్టర్

గత సీజన్‌లో ధాన్యం తీసుకొని ఇప్పటివరకు CMR ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదుచేసి, RR యాక్ట్ కింద చర్యలుచేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్ సమీక్షనిర్వహించారు. 2024-25 వానాకాలానికి సంబంధించి 100% CMR ధాన్యం అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తదుపరి సీజన్ ధాన్యం కేటాయించాలని కలెక్టర్ సూచించారు. రబిసీజన్ వరిధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News March 31, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

❤కనిపించిన నెలవంక.. రేపే రంజాన్❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤’రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం’❤ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు❤జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి❤సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు❤గద్వాల: చట్నీలో బల్లి❤బల్మూర్: జిల్లా స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు❤గ్రామాల్లో పంచాంగ శ్రవణం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 30, 2025
వార్న్ మరణంలో కొత్త కోణం

దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ మరణంలో మరో కోణం తెరపైకి వచ్చింది. ఆయన మరణించిన విల్లాలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఓ మెడిసిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దానిని తొలగించారని కథనంలో పేర్కొంది. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడంలో ఆస్ట్రేలియా అధికారుల పాత్ర ఉండవచ్చని ఆ విల్లాకు వెళ్లిన ఓ పోలీసు అధికారి తాజాగా తెలిపాడు. 2022లో థాయ్‌లాండ్‌లో వార్న్ హఠాన్మరణం చెందారు.
News March 30, 2025
యాదాద్రి దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పంచాంగాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు.