News March 25, 2024
ప్రత్తిపాడు: ప్రధాన పార్టీల్లో ముదిరిన వర్గపోరు

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను వర్గపోరు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుకు వ్యతిరేకంగా పూనాటి రమేశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వర్గపోరును తట్టుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.
Similar News
News September 9, 2025
GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.
News September 8, 2025
Way2News ఎఫెక్ట్.. దుర్గగుడికి వైద్యుల కేటాయింపు

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
News September 8, 2025
CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.