News March 25, 2025
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త కిలో చికెన్‌కు రూ.10 వసూలు: YCP

MLA భూమా అఖిలప్రియ భర్తపై YCP సంచలన ఆరోపణ చేసింది. ‘టీడీపీ నాయకుల కక్కుర్తి పరాకాష్ఠకు చేరింది. పనులు.. కాంట్రాక్టులే కాకుండా వీధి వ్యాపారులు, చికెన్ కొట్లనూ వదలడం లేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త చికెన్ వ్యాపారాలపై కన్నేసి కిలోకి రూ.10 వసూలు చేస్తున్నారు. తాము చెప్పిన ఫారం నుంచే చికెన్ కొనాలని హుకుం జారీ చేశారు. రూ.కోటి ఇవ్వాలని హోల్ సేల్ వ్యాపారిని బెదిరించారు. ఇదేం కక్కుర్తి’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News November 5, 2025
విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
News November 5, 2025
కాకినాడ: మూడు రోజుల్లో వస్తా అన్నారు.. ఇంకా రాలేదే..!

గత నెల 9న ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మూడు రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి, కాకినాడ నుంచి కోనపాపపేట వరకు బోటులో పర్యటించి కాలుష్య జలాలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పర్యటనకు రాకపోవడంతో యూ.కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “డిప్యూటీ సీఎం గారు రండి, ఒక్కసారి కాలుష్యం చూడండి” అని వారు కోరుతున్నారు.
News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


