News March 25, 2025

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లో వాటర్ షెడ్ యాత్ర

image

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లోని మండలానికి రెండు గ్రామాల చొప్పున వాటర్ షెడ్ యాత్రను నిర్వహించనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నీటి పరిరక్షణ, సాగునీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా ‘వాటర్ షెడ్ యాత్ర’ చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి నిల్వలను మెరుగుపరచడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, రైతులకు నీటి సదుపాయం అందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Similar News

News December 31, 2025

గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

image

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.

News December 31, 2025

2026 రిపబ్లిక్ పరేడ్‌.. చరిత్రలో తొలిసారి యానిమల్ కంటింజెంట్

image

2026 రిపబ్లిక్ డే పరేడ్‌లో కొత్తగా యానిమల్ కంటింజెంట్ ప్రదర్శన జరగనుంది. సైన్యంలోని రీమౌంట్ & వెటర్నరీ కార్ప్స్‌లో శిక్షణ తీసుకున్న జంతువులు కవాతు చేయనున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో బార్డర్ల వెంబడి భద్రతకు ఉపయోగించే 2 బాక్‌ట్రియన్ ఒంటెలు, 4 రాప్టార్లు, 10ఇండియన్ బ్రీడ్ ఆర్మీ, 6 కన్వెన్షనల్ మిలిటరీ డాగ్స్ ప్రదర్శనలో పాల్గొంటాయి. లద్దాక్‌‌కు చెందిన జన్‌స్కార్ పోనీలు కవాతు చేయనున్నాయి.

News December 31, 2025

PPM: ‘బాలల ఆరోగ్య భవిష్యత్తే ధ్యేయంగా డీఈఐసీ సేవలు’

image

చిన్నారులకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించినప్పుడే భవిష్యత్ బలంగా ఉంటుందని RBSK జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు పేర్కొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి అక్కడ సేవలపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు డీఈఐసీలో చిన్నారులకు అందజేసిన సేవల వివరాలు, నివేదికలు, నిర్వహణ ప్రక్రియ మొదలగు అంశాలపై విశ్లేషించారు.