News March 25, 2025
VZM: నేడు,రేపు APPSC పరీక్షలు

నేడు, రేపు జరగనున్న APPSC పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన DRO ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, 25, 26 తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News March 30, 2025
VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.
News March 30, 2025
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

డెంకాడ మండలంలోని శనివారం రాత్రి ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో విజయనగరంలోని గాంధీనగర్‌కు చెందిన నేమాల రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుడు సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉగాది రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
News March 30, 2025
విశాఖలో తండ్రిని చంపిన తనయుడు

విశాఖ శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి అప్పారావు (82) ఆరిలోవ సెక్టార్- 2 డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. తరచూ తన భార్యను తిట్టడం, కుమారుడు మీద పరుషపదజాలం వాడటం వంటివి చేస్తుంటాడు. కాగా శనివారం తన తల్లిని తండ్రి అప్పారావు కొట్టడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు బాలయోగి బ్లేడుతో దాడి చేశాడు. దీంతో అప్పారావు చనిపోయారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.