News March 25, 2025
నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.
Similar News
News March 29, 2025
మే 23 నుంచి వారం పాటు 30 రైళ్లు రద్దు

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.
News March 29, 2025
WGL: యువతి దూరం పెడుతోందని యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతోందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన సాయి(25) కొంతకాలంగా HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని సాయి ప్రేమించగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కొంతకాలంగా ఆ అమ్మాయి దూరం పెడుతుండటంతో అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెప్పారు.
News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.