News March 25, 2025
ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్‌లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్‌లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.
Similar News
News March 29, 2025
2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.
News March 29, 2025
90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
News March 29, 2025
రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.