News March 25, 2025
నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.
Similar News
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.
News November 10, 2025
గద్వాలలో 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

గద్వాల జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 76 ప్రారంభించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం చెప్పారు.
News November 10, 2025
MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


