News March 25, 2025

నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.

Similar News

News December 28, 2025

ఈనెల 30న ఉమ్మడి పాలమూరు జిల్లా హాకీ జట్టు ఎంపికలు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల పురుషుల హాకీ జట్టు ఎంపికలు ఈనెల 30న వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. 17-25 ఏళ్ల లోపు వారు అర్హులని, ప్రిన్సిపల్ ధ్రువీకరించిన బోనఫైడ్ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.

News December 28, 2025

అల్లూరి జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

image

అల్లూరి జిల్లా కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 28, 2025

యాదాద్రి: అపూర్వం.. 26 ఏళ్ల జ్ఞాపకాల పందిరి

image

అడ్డగూడూరు మండలం కోటమర్తి ZPHS.. ఆదివారం అపురూప వేడుకకు వేదికైంది. 1998-99లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకేచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని, బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను వేదికపైకి ఆహ్వానించి, శాలువాలతో సత్కరించి, పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు.