News March 25, 2025

HYDలోని రోడ్డు ప్రమాదం.. KTDM యువకుడు మృతి

image

దమ్మపేట మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన బంటు రాజ్ కుమార్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజ్‌కుమార్ HYDలోని ప్రైవేట్ కాలేజీలె బీటెక్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదంశాత్తు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు..

Similar News

News November 4, 2025

విజయనగరంలోనూ భూప్రకంపనలు?

image

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News November 4, 2025

సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

image

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.

News November 4, 2025

MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.