News March 25, 2025
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

టీడీపీ నేతల దురాగతాలకు తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆయన.. YCP కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్‌పై ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు తాము భయపడమని, తాము తిరగబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News March 29, 2025
ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.
News March 28, 2025
ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్, కోటంరెడ్డి

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
News March 28, 2025
నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.