News March 25, 2025
కాకాణిపై కేసు నమోదు

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసినా క్వార్ట్జ్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదు చేశారు. గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చేర్చారు. ఆయనపై 120బి, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Similar News
News March 30, 2025
హార్దిక్ పాండ్యకు మరో షాక్!

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.
News March 30, 2025
నేను, భట్టి జోడెద్దుల్లా పని చేస్తున్నాం: రేవంత్

TG: జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని CM రేవంత్ అన్నారు. తాను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ‘కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుంది. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయి. అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటాం. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదు’ అని ఉగాది వేడుకల కార్యక్రమంలో అన్నారు.
News March 30, 2025
అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.