News March 25, 2025
ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.
Similar News
News March 29, 2025
ప.గో: సోషల్ పరీక్ష తేదీ మార్పు..డీఈవో

పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1కు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు డీఈవో నారాయణ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31 రంజాన్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన సోషల్ పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి మార్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు
News March 28, 2025
ప.గో: AMC ఛైర్మన్లు ఎవరంటే..?

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా పలువురికి అవకాశం దక్కింది.
☞ తణుకు: కొండే శివ (టీడీపీ)
☞ తాడేపల్లిగూడెం: మంగాబాయి (జనసేన, పైఫొటో)
☞ ఉంగుటూరు: కరేటి జ్యోతి(జనసేన)
☞దెందులూరు: గారపాటి రామసీత(టీడీపీ)
☞ ఏలూరు: మామిళ్లపల్లి పార్థసారథి (టీడీపీ)
News March 28, 2025
అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.