News March 25, 2025

మా ఎన్నికల్లో జోక్యానికి భారత్, చైనా యత్నిస్తాయి: కెనడా

image

తమ దేశంలో వచ్చే నెల 28న జరిగే ఎన్నికల్లో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ జోక్యం చేసుకునేందుకు యత్నించనున్నాయని కెనడా నిఘా సంస్థ CSIS డిప్యూటీ డైరెక్టర్ వానెసా లాయిడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIని వాడుకుని చైనా ఈ చర్యకు పాల్పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. భారత్‌కు కూడా ఎన్నికల్ని ప్రభావితం చేయాలన్న ఉద్దేశాలున్నట్లు మా దృష్టికి వచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు. ఆ ఆరోపణల్ని భారత్, చైనా ఖండించాయి.

Similar News

News March 29, 2025

దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

image

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.

News March 29, 2025

భూకంపం.. 1644 మంది మృతి

image

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

News March 29, 2025

రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.

error: Content is protected !!