News March 25, 2025

యువకుడి ప్రాణాలు తీసిన డేటింగ్ యాప్

image

మణుగూరు మండలంలో సోమవారం<<15868447>> ఉరివేసుకుని యువకుడు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వాసవీనగర్‌కి చెందిన సుగ్గుల కార్తీక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. డేటింగ్ ఫ్రెండ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించాడు. చివరకు ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 24, 2026

తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

image

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 24, 2026

సిరిసిల్ల: స్కూలు వాహనాలపై రవాణాశాఖ నిఘా.. 15 సీజ్‌

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సులు, ఆటోలపై రవాణాశాఖ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీటీవో లక్ష్మణ్‌ ఆదేశాల మేరకు వేములవాడ, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 15 వాహనాలను సీజ్‌ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్‌నెస్‌ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

News February 24, 2026

విజయవాడలో బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

image

విజయవాడ వన్ టౌన్ పరిధి వాగు సెంటర్ వద్ద బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు రాచకొండ రుషి (9) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. అతణ్ని GGHకి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫేస్‌కి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని సూచించారు. నగరంలో రోజు రోజుకి కుక్క కాట్లు అధికమవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.