News March 25, 2025

భీమిలి బీచ్‌లో నిర్మాణాల తొలగింపు

image

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.

Similar News

News March 31, 2025

విశాఖ: యువకుడిపై కోపంతో బైక్‌లకు నిప్పు పెట్టిన యువతి

image

విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో శుక్రవారం అర్ధరాత్రి 18 బైకులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓ యువతి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తితో విభేదాల కారణంగా అతని బైక్‌‌కు నిప్పు పెట్టగా ఆ మంటలు మిగతా బైక్‌లకు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. సదరు మహిళ ఆ యువకుడిని గతంలో ప్రేమించిందని అతడికి వేరొకరితో పెళ్లి కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News March 31, 2025

విశాఖ సీపీ ఆఫీసులో పీ.జీ.ఆర్.ఎస్ రద్దు

image

రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News March 30, 2025

విశాఖలో మ్యాచ్ చూసిన అనాథ చిన్నారులు 

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు 65 మంది అనాథ‌ చిన్నారులకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ అవ‌కాశం క‌ల్పించారు. వీరిలో భీమిలి ఎస్.ఓ.ఎస్ ఆర్గనైజేషన్ నుంచి 45 మంది, గాజువాకకు చెందిన డిజైర్ ఆర్గనైజేషన్ నుంచి 20 మందికి అవకాశం కల్పించారు. క్రికెట్ నేరుగా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. సీపీతో కలిసి వారు ఫొటోలు దిగారు.

error: Content is protected !!