News March 25, 2024
అమీర్‌పేట్‌లో అమ్మాయి కోసం యువకుల గొడవ

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.
Similar News
News March 11, 2026
నెక్లెస్ రోడ్ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
News March 11, 2026
యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు కాలుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్
News March 11, 2026
హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.


