News March 25, 2025

పాలమూరుకు మరో మంత్రి పదవి..!

image

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.

Similar News

News March 31, 2025

ఒంటిమెట్ట రాములోరికి నంద్యాల తళంబ్రాలు సిద్ధం

image

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణం కోసం భక్తులు వడ్లను గోటితో ఒలిచిన తళంబ్రాలను నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి సమక్షంలో పూజ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడ్లను భక్తులు రామాలయంలో గోటితోనే ఒలుస్తారని తెలిపారు. ఆ తళంబ్రాలను కళ్యాణం సమయంలో రాముల వారి చెంతకు చేరుస్తారని అర్చకులు తెలిపారు.

News March 31, 2025

GDK: వైద్యానికి ₹18 లక్షలు.. అయిన ప్రాణం నిలువలేదు!

image

గోదావరిఖని మాతంగి కాలనీకి చెందిన నవీన్ కుమారుడు దేవాన్ష్ ఇటీవల ఫిట్స్ రావడంతో HYDరెయిన్‌బో హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటికే దాదాపు ₹18 లక్షలు ఖర్చు అయ్యాయి. అయితే హస్పిటల్ యాజమాన్యం మరో ₹ 5 లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొంది. దీంతో మృతుని తండ్రి MLAరాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి డెడ్ బాడీ ఇప్పించారు.

News March 31, 2025

హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

image

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్‌కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.

error: Content is protected !!