News March 25, 2025
స్టేట్ చీఫ్గా ఎంపీ ఈటల రాజేందర్..?

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.
Similar News
News October 20, 2025
REWINED.. వరంగల్లో ఇదే తరహా తిరుగుబాటు..!

నిజామాబాద్లో రియాజ్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే జనగామలో కూడా ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడ్డ ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటన 2015 ఏప్రిల్ 7న జరిగింది. ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఉన్న వికారోద్దీన్ను హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా జనగామ ప్రాంతంలో మల విసర్జన కోసం ఆగారు. ఆ సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు.
News October 20, 2025
వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it
News October 20, 2025
పాలమూరు: కురుమూర్తి జాతర.. ‘ఉద్దాల’ ఉత్సవం అంటే..!

ప్రసిద్ధ కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ‘ఉద్దాల’ ఉత్సవం ప్రధాన ఘట్టం. స్వామివారి పాదుకలనే ‘ఉద్దాలు’ అని పిలుస్తారు. వీటిని వడ్డెమాన్కి చెందిన దళితులు నియమ నిష్ఠలతో తయారు చేస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో వీటి తయారీ జరుగుతుంది. దీపావళి అమావాస్య నుంచి సుమారు 7 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.