News March 25, 2025
కేబినెట్ విస్తరణ.. హైదరాబాద్‌కు NO ఛాన్స్..!

మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.
Similar News
News March 31, 2025
జలుమూరు దేవాలయ ఘటనపై SP మహేశ్వర్ రెడ్డి పరిశీలన

జలుమూరు మండలంలో పలు దేవాలయాలలో ఉగాది పర్వదినాన అన్యమత ప్రచారాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలలో వివిధ అన్యమత ప్రచారకులుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో జరిగిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. ఆయనతోపాటు క్రైమ్ ASP శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News March 31, 2025
మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్‌లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
News March 31, 2025
అన్నమయ్య: ఉగాది వేడుకల్లో పాల్గొన్న SP దంపతులు

అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగను జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. సంప్రదాయ దుస్తుల్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులకు సిబ్బందికి ఉగాది పచ్చడి, ప్రసాదం, భోజనాలను ఎస్పీ దంపతులు పంపిణీ చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగి జిల్లా పోలీసులు అందరిలో ఉత్సాహాన్ని నింపారు.