News March 25, 2025

ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్‌ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతి.. కొత్త విషయాలు

image

AP: పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే మిస్టరీ వీడింది. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. సా.5.30 నుంచి రా.8.45 వరకు అక్కడే ఉన్నారని తెలిపారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన విజయవాడకు రాకముందే ప్రమాదంలో బైక్ హెడ్ లైట్ దెబ్బతిందని, అయినా రాజమండ్రికి ప్రయాణం కొనసాగించారని గుర్తించారు.

News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

News March 31, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

image

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!