News March 25, 2025

కొత్త క్యాబినెట్.. వరంగల్‌కు దక్కని అవకాశం!

image

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.

Similar News

News July 5, 2025

VKB: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

News July 5, 2025

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

News July 5, 2025

JGTL: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన పోలీసులు

image

మంచిర్యాల్ జిల్లా చున్నంబట్టివాడకు చెందిన కొమిరి రజిత కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాల (D) ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చిన రజిత బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు స్పందించి సమయస్ఫూర్తితో అడ్డుకొని ఆమెను కాపాడారు.