News March 25, 2025
బాపట్ల: ‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు’

ఆస్తిరాయించుకొని తన కొడుకు తనను చంపాలనుకుంటున్నాడని సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు సయ్యద్ మోహిద్దీన్, కోడలు నజీమూన్‌లు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా భర్తను చంపాలని చూశారు. దీంతో నాభర్త భయంతో పారిపోయాడు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కూతరు వద్ద ఉన్నా, నన్ను కాపాడండి’ అని వేడుకున్నారు.
Similar News
News March 31, 2025
గ్రూప్-1 ఫలితాల్లో నల్గొండ జిల్లా వాసికి సెకండ్ ర్యాంక్

నల్గొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో 535 మార్కులతో జనరల్ ర్యాంకుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రమాదేవి అనుముల మండలం అలీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్, డీఏఓ, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యారు.
News March 31, 2025
ఫిరంగిపురం: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

ఫిరంగిపురంలో పిల్లల్ని సవతి తల్లి లక్ష్మి కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కాగా కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
News March 31, 2025
NZB: 1981లో మంచినూనె ధర ఎంతో తెలుసా..?

ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పైపైకి పోతుంటే..ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు రాజిగో రాజన్న అన్న పాట గుర్తోస్తోంది. సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనే పరిస్థితులు బాగున్నాయని అంటున్నారు జనాలు.1981లో kg మంచినూనె ₹13:80, 1/2kg శనగపిండి ₹2:50, జిందాతిలిస్మాత్ ₹1:10, బట్టల సబ్బు ₹1:60, కొబ్బరికాయ ₹1:75గా ఉన్న ఓ బిల్లు వైరల్ అవుతోంది.