News March 25, 2025
LXT: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని లక్షెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మ తెలిపారు. విద్యార్థులు త్వరగా చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
నాగారం: కారు ఢీ.. కానిస్టేబుల్ దుర్మరణం

నాగారం మండలంలో అతివేగంతో వచ్చిన<<18299567>> కారు ఢీకొనడంతో<<>> కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కమలాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 16, 2025
సఖినేటిపల్లి: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు

సఖినేటిపల్లి (M) అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలలకు శనివారం అరుదైన చేపలు చిక్కాయి. అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన వేలంలో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. ప్రధానంగా 13 గోల్డ్ ఫిష్ (కచ్చిడి) చేపలు ఏకంగా రూ.52 వేలు పలకడం విశేషం. ఇక మార్కెట్లో కోనాం కిలో రూ.600, కవర్లు రూ.70, బోంబేడెక్ రూ.65 చొప్పున ధర పలికాయి. మంచి ధర దక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
News November 16, 2025
జనగామ: యాక్సిడెంట్.. మార్చురీలో మృతదేహాలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో HNK-HYD జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18300916>>ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే<<>>. హన్మకొండ జిల్లా బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన పూలమాటి ఓం ప్రకాశ్ మృతి చెందారు. వీరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రిలో ఉంచారు.


