News March 25, 2025
తిరుపతి: సైలెంట్ మోడ్‌లో వైసీపీ నేతలు.?

తిరుపతి(D)లో YCP నేతల పరిస్థితి కొంచెం ఇష్టం-కొంచెంకష్టం అన్నట్లు మారింది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, రోజా, మోహిత్ రెడ్డి మినహా మిగిలిన వారు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉన్నారని సమాచారం. బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి, సత్యవేడు ఇన్‌ఛార్జ్ రాజేశ్ వంటి నేతలు నియోజకవర్గంలో పెద్దగా కనబడటం లేదని టాక్. చెవిరెడ్డి సైతం మునుపటి స్థాయిలో చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది.
Similar News
News February 26, 2026
అనకాపల్లి: 217 మంది విద్యార్థులు గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం. వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.
News February 26, 2026
NGKL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కజ్జం ఉమాపతి తెలిపారు. 2026 -27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం అర్హత కలిగిన ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు పొంది కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News February 26, 2026
NCC విద్యార్థులకు రిజర్వేషన్లు: మండిపల్లి

రాష్ట్రంలో NCC కేడెట్లకు కాలేజీ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఆయన మాట్లాడారు. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖల్లో NCCకి ప్రత్యేక కోటా లేదని స్పష్టం చేశారు. క్రీడాకారుల ఉద్యోగ రిజర్వేషన్‌ను 2% నుంచి 3%కు పెంచామన్నారు. DSCలో 421 క్రీడాకారులకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు.


