News March 25, 2025
దిలావర్పూర్ ఆందోళనకారులపై కేసులు ఎత్తి వేసేనా…?

గతేడాది దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 130రోజుల నిరసనల తర్వాత ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను అధికారంలోకొస్తే తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తమపై కేసులు తొలగించాలని మహిళలు ఎదురుచూస్తున్నారని నిర్మల్ MLA మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
Similar News
News March 31, 2025
అల్లవరం: బ్రిడ్జి పైనుంచి దూకేసిన వ్యక్తి గల్లంతు

అల్లవరం మండలం బోడసకుర్రు- పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి ఓ కారులో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీంతో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
News March 31, 2025
VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.