News March 25, 2025

అశుతోశ్‌ను అలా ఎలా వదిలేశారో!

image

అశుతోశ్ గత ఏడాది పంజాబ్‌కు ఫినిషర్‌గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్‌లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్‌కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!

Similar News

News November 9, 2025

ప్రచారానికి వాళ్లు దూరమేనా!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.

News November 9, 2025

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

image

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్‌కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.

News November 9, 2025

మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

image

సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.