News March 25, 2025
ఏలూరు జిల్లాకు అలర్ట్..!

ఏలూరు జిల్లాలో వాతావరణం మారుతోంది. రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ వేలేరుపాడులో 40.1, పోలవరంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. 26న పోలవరంలో 39.4, వేలేరుపాడులో 40 డిగ్రీల ఎండ కాస్తుందని తెలిపింది.
Similar News
News March 31, 2025
గుడివాడ: కొడాలి నానితో పాటు ముంబై వెళ్లింది వీరే.!

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో సోమవారం హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్‌ఎస్ రెడ్డి, శివకుమార్ అరెకపూడు, ప్రియాంక ఫెర్నాండేజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మిలు కూడా ముంబై వెళ్లారు.
News March 31, 2025
వికారాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం పరిధిలోని ఆలంపల్లి ఆలం షాహి దర్గా వద్ద ముస్లిం సోదరులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీక రంజాన్: పరిగి ఎమ్మెల్యే

రంజాన్ పండుగను పురస్కరించుకుని పరిగి పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.