News March 25, 2024
కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు.
Similar News
News October 24, 2025
KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.
News October 24, 2025
కరీంనగర్: పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ

శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ.ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం వాల్యూయేషన్ కూడా త్వరగా చేపట్టి ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని తెలిపారు.