News March 25, 2025

GDK: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోదావరిఖనికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 31, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు…

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఇందుర్తి 40.6°C నమోదు కాగా, బురుగుపల్లి 40.5, జమ్మికుంట 40.3, వీణవంక 40.2, కొత్తపల్లి-ధర్మారం 40.1, ఖాసీంపేట 39.9, వెంకేపల్లి 39.7, బోర్నపల్లి 39.5, కొత్తగట్టు, దుర్శేడ్ 39.4, చింతకుంట, గంగాధర 39.3, ఆసిఫ్ నగర్, తాంగుల 39.0, రేణికుంట, కరీంనగర్ 38.8, ఈదులగట్టేపల్లి, మల్యాల 38.7, గుండి, నుస్తులాపూర్ 38.4°C గా నమోదైంది.

News March 31, 2025

నిజామాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. నిజామాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

News March 31, 2025

పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

error: Content is protected !!