News March 25, 2025

‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

image

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.

Similar News

News March 31, 2025

కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి నోటీసులు

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి <<15944206>>నోటీసులు<<>> జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో ఇవాళ విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. దీంతో రేపు ఉదయం 11గంటలకు విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు. రేపు కూడా కాకాణి విచారణకు గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

News March 31, 2025

CM తలపెట్టిన ‘P4’ గొప్ప ఆలోచన: అనగాని

image

AP: విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, KG నుంచి PG వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘DSC ద్వారా 16K టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. CM తలపెట్టిన P4 కార్యక్రమం గొప్ప ఆలోచన’ అని బాపట్ల జిల్లా పర్యటనలో అన్నారు. ఈ సందర్భంగా రేపల్లెలో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌ను ఆయన కోరారు.

News March 31, 2025

IPL: చెన్నైని దాటేసిన ఆర్సీబీ

image

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న IPL జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మొత్తంగా 17.8 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానానికి ఎగబాకింది. దీంతో ఇప్పటివరకు మొదటి ప్లేస్‌లో ఉన్న CSK(17.7M)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో MI(16.2M) ఉంది. కాగా ముంబై, చెన్నై తలో 5 సార్లు టైటిల్ గెలవగా ఆర్సీబీ ఖాతాలో ఒక్కటీ లేదు. అయినా ఫాలోయింగ్‌లో మాత్రం అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!