News March 25, 2025

జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు

image

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Similar News

News September 18, 2025

నిజామాబాద్, కామారెడ్డి RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. NZB జిల్లాలో 49, కామారెడ్డిలో 30 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. NZB జిల్లాలో 19, కామారెడ్డి జిల్లాలో 12 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

News September 18, 2025

మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఈవో

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా ఎంఈవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. భోజనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలోగా విద్యార్థుల హాజరును మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.